ఆర్‌ఎంపీ డాక్టర్లకు చట్టబద్ధత తీసుకువస్తా


డోన్‌: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. డోన్‌ నియోజకవర్గం కొలుములపల్లిలోని బ్రహ్మయ్య దేవాలయం వద్ద ఆర్‌ఎంపీ డాక్టర్లు వైయస్‌ జగన్‌ను కలిసి వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ..రాష్ట్రంలో గ్రామీణ వైద్యులే కాకుండా అందరూ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నంత కాలం ప్రజా పరిపాలన అందించారన్నారు. మళ్లీ అదే సువర్ణ పరిపాలనను తీసుకొస్తానని వైయస్‌ జగన్‌ ఆర్‌ఎంపీలకు హామీ ఇచ్చారు. 104ను గ్రామాల్లో వెలుగులు నింపే వాహనంగా తయారు చేస్తామని స్పష్టం చేశారు. ఆ వాహనంలో బీపీ, షుగర్‌ మాత్రలు, కంటికి సంబంధించిన అన్ని వైద్య పరీక్షలు చేసే విధంగా తయారు చేస్తామన్నారు. దాంట్లో గ్రామీణ వైద్యులను భాగస్వాములను కూడా చేస్తామన్నారు. ఆర్‌ఎంపీలకు చట్టబద్ధత తీసుకువస్తామన్నారు. Back to Top