కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చాలి

రాధాకృష్ణపురం(మందస): రైసు మిల్లులలో పని చేస్తున్న కార్మికుల న్యాయబద్ధమైన కోర్కెలను యాజమాన్యాలు తీర్చాలని వైయస్సార్‌ సీపీ పలాస నియోజకవర్గం సమన్వయకర్త జుత్తు జగన్నాయకులు పేర్కొన్నారు. మండలంలోని రాధాకృష్ణపురం రైసు మిల్లుల వద్ద రిలే నిరాహారదీక్ష  చేస్తున్న కార్మికుల శిబిరాన్ని మంగళవారం ఆయన సందర్శించి, కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జగన్నాయకులు మాట్లాడుతూ.. 2016వ సంవత్సరం డిసెంబరులో కార్మికులు, యాజమాన్యానికి జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాలన్నారు. కార్మికుల లేనిదే యాజమాన్యాలు లేవని, యాజమాన్యాలు సానుకూలంగా వ్యవహరించాలన్నారు. కార్మికులు, యాజమాన్యానికి అధికారులు, సంఘం నాయకుల సమక్షంలో చర్చలు జరుగగా, ఈ సమావేశంలోనే కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయకపోవడంతో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. యాజమాన్యాలు తక్షణమే స్పందించి, కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఆయన వెంట మందస పట్టణ అధ్యక్షుడు మట్ట ఆనందరావు, గొలుసు చంద్రశేఖర్, జోగ కృష్ణారావులున్నారు. 

 
Back to Top