పిల్ల‌లను చదివించుకుంటే జీవితాలు బాగుంటాయి


కర్నూలు: పిల్లలను చదివించుకుంటేనే జీవితాలు బాగుంటాయని మహిళలకు వైయస్‌జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శ‌నివారం రాతన గ్రామంలో మహిళలు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను వైయస్‌జగన్‌ అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు తమ రుణాలు మాఫీ చేశాడని మహిళలు ముక్తకంఠంతో చెప్పారు. ఇందుకు స్పందించిన వైయస్‌ జగన్‌ వారికి భరోసా కల్పించారు. మన ప్రభుత్వం వచ్చాక మీ పిల్లలను తాను చదివిస్తానని, బ్యాంకు రుణాలన్నీ కూడా నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని, వడ్డీ డబ్బులు కూడా బ్యాంకులకు కడుతామని చెప్పారు. 
వైయస్‌ జగన్‌ను కలిసిన టమాట రైతులు
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌జగన్‌ను టమాట రైతులు కలిశారు. ఈ సందర్భంగా టమాట ధరలను అడిగి తెలుసుకున్న వైయస్‌ జగన్‌ ఈ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రైతులకు బాక్స్‌కు రూ.200 ఇస్తున్నారని, ఇదే చంద్రబాబుకు సంబంధించిన హెరిటేజ్‌ షాపులో కేజీ రూ.50 చొప్పున విక్రయిస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితి మారుస్తానని, టమాట జ్యూస్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయిస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. 
 

Back to Top