విజయమ్మకు విశాఖలో ఘన స్వాగతం

విశాఖపట్నం, 13 అక్టోబర్‌ 2012:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ‌ శనివారం మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకున్నారు.  విశాఖ విమానాశ్రయంలో ఆమెకు అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నేతలు భారీ సంఖ్యలో ఘనంగా స్వాగతం పలికారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆమె వెళుతున్నారు. హైదరాబాద్‌ నుంచి విమానంలో వచ్చిన విజయమ్మ విశాఖపట్నం విమానాశ్రయంలో దిగారు. విమానాశ్రయం నుంచి ఆమె రోడ్డు మార్గంలో శ్రీకాకుళం జిల్లాకు వెళతారు.

పార్టీ నాయకుడు ధర్మాన కృష్ణదాసు మాతృమూర్తి సావిత్రమ్మ ఈ నెల నాలుగవ తేదీన మరణించారు. జిల్లాలోని పో‌లాకి మండలం మబుగాంలో ఉన్న కృష్ణదాసు ఇంటికి వెళ్లి విజయమ్మ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. విజయమ్మ వెంట పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ కూడా ఉన్నారు.

Back to Top