చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు
విష జ్వరాలతో గిరిజనులు పిట్టల్లా రాలిపోతున్నారు
అయినా పట్టించుకోని ప్రభుత్వం
జన్మభూమి కమిటీలు పెట్టి కుట్రలు చేస్తున్న సర్కార్‌
బాబు పాలనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విశాఖ ప్రజానీకం
విశాఖపట్నం: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎందుకు ఉన్నారు.. ఎవరి మేలు చేకూర్చేందుకు పనిచేస్తున్నారని విశాఖపట్నం జిల్లా వాసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సమస్యలతో సతమతమవుతున్నా.. పట్టించుకోని ప్రభుత్వం ఉంటే ఎంత.. లేకపోతే ఎంతా అంటూ ధ్వజమెత్తారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన ప్రజలు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వంలో గిరిజనులకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీరు, హౌసింగ్, సరైన వైద్యం, విద్యా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా డెంగీ, మలేరియా వంటి భయంకరమైన వ్యాధులతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యం అందక పేద ప్రజలు మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం కనీసం ఆదుకోకపోవడం దారుణమన్నారు. అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరికి  ముఖ్యమంత్రిగా ఉన్నారని ప్రశ్నించారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ వైయస్‌ జగన్‌ చెప్పామని ఆదుకుంటానని భరోసా ఇచ్చారన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడేందుకు అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. 
వివక్ష చూపుతున్నారు..
జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి చంద్రబాబు ప్రజలకు సంక్షేమాలు అందకుండా కుట్ర చేశాడని విశాఖ ప్రజలు మండిపడ్డారు. జన్మభూమి కమిటీలు చెప్పిందే వేదంగా అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. అన్యాయం జరుగుతుందని ప్రశ్నించినా పట్టించుకోవడం లేదని, టీడీపీకి ఓటు వేయని ప్రజలపై వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీ, అచ్చుదాపురం ఎస్సీజెడ్, నావీ నిర్వాసితులు, మత్య్సకారుల సమస్యలు, రైవాడ వర్కర్లు, రైతుల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇస్తున్నారన్నారు. 
Back to Top