హైదరాబాద్ బయల్దేరిన విజయమ్మ

విశాఖపట్నం
17 అక్టోబర్ 2013 : వైయస్ఆర్
కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్య క్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ గురువారం ఉదయం హైదరాబాద్
కు తిరుగుపయనమయ్యారు. ఆమె బుధవారం నాడు  తుపాను
బాధితుల్ని పరామర్శించిన  విషయం
తెలిసిందే. పై-లీన్
తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి, కవిటి, సోంపేట మండలాల్లోని పలు మారుమూల గ్రామాల్లో
ఆమె  విస్తృతంగా
పర్యటించారు. ఆమె అడుగిడిన ప్రతిచోటా
బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి
తమ కష్టాలు చెప్పుకొన్నారు. రైతుల కష్ట నష్టాలు
తెలుసుకుంటూ...బాధిత రైతులను పరామర్శిస్తూ...
వలలు, బోట్లు, ఆస్తులు కోల్పోయిన మత్స్యకారులకు భరోసానిస్తూ...  రైతులకు
అండగా ఉంటామని విజయమ్మ హామీ ఇచ్చారు.నష్టపరిహారం
అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెబుతూ ఆమె ముందుకు సాగారు.

Back to Top