విహెచ్‌ది నోరా.. మున్సిపాల్టీ మోరీనా: గట్టు

హైదరాబాద్‌, 16 ఏప్రిల్‌ 2013 : రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు వ్యాఖ్యలపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ‌నాయకుడు గట్టు రామచంద్రరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వి.హెచ్‌కు పిచ్చిపట్టినందు వల్లే శ్రీ జగన్‌ను ఇతర రాష్ట్రాల జైలుకు తరలించాలంటున్నారని ఆయన మండిపడ్డారు. వి.హెచ్‌కు పిచ్చి ముదిరితే ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. వి.హెచ్ నోటికి మున్సిపాలిటీ మోరీకి పెద్ద తేడా లేదని రామచంద్రరావు మంగళవారం ఇక్కడ వ్యాఖ్యానించారు.

సోనియా, రాహుల్‌ గాంధీల కాళ్ళు మొక్కడం తప్ప వి.హెచ్‌కు ఇంకేమీ చేతకాదని గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. కనీసం తన వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోలేని చరిత్ర వి.హెచ్దని ఆయన ఎద్దేవా చేశారు. ‌మహానేత డాక్టర్‌ వైయస్ ‌మృతిపై కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అవహేళన చేయటం తగదని గట్టు హితవు పలికాన్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని ‌ఆయన సవాల్ ‌చేశారు. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కార్యకర్తలే వారిని ఓడిస్తారని ‌గట్టు రామచంద్రరావు అన్నారు.
Back to Top