వైయస్ ఉపాధ్యాయ పక్షపాతి

హిందూపురం: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఉపాధ్యాయ పక్షపాతి అని వైయస్ఆర్‌ సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యుడు వై విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. పి.మధుసూదనరెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ వైయస్ఆర్‌ టీఎఫ్ హిందూపురం జోన్ సమావేశంలో ఆయన మాట్లాడారు.  వైయస్  ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపారన్నారు. వైయస్ఆర్‌ సీపీ టీచర్‌‌ ఫెడరేషన్ ఏర్పాటు అభినందనీయమన్నారు. వైఎస్ మరణానంతరం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కన్వీనర్ ఓబుళపతి, రాష్ట్ర ప్రతినిధి కులశేఖర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకటరెడ్డి, వైయస్ఆర్‌ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు చౌళూరు రామకృష్ణారెడ్డి, కొండూరు వేణుగోపాల్‌రె డ్డి, జహీరుద్దీన్, పురుషోత్తంరెడ్డి, మడకశిర కన్వీనర్ గోవర్ధన్‌రెడ్డి మాట్లాడారు. సమావేశంలో వైయస్ఆర్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి మహేష్, పట్టణ ఏ, బీ బ్లాక్‌ల కన్వీనర్లు గోపిక్రిష్ణ, ఫైరోజ్, లేపాక్షి, మండల కన్వీనర్లు అంజినరెడ్డి, బసిరెడ్డి, మైనార్టీ సెల్ కన్వీనర్ రొద్దం మున్నా, సభ్యుడు రెహమాన్, 700 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Back to Top