వైయస్ పాలన జగన్‌కే సాధ్యం: ఎంపీ మేకపాటి

 
నెల్లూరు: మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తరహా పాలన జగమోహన్‌రెడ్డికే సాధ్యమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. కోడూరుపాడు పంచాయతీలో పర్యటించారు. పంచాయతీ పరిధిలోని గమళ్లపాళెం, దళితకాలనీ, గిరిజన కాలనీ, కల్తీకాలనీ ప్రజలను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎయస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలు తీరుతాయని, ఆ రోజులు ఎంతో దూరం లేవన్నారు. దివంగత డాక్టర్  రాజశేఖర్‌రెడ్డి అందించిన పాలనను సమర్థంగా ఆచరించగలిగే సత్తా జగన్‌మోహన్‌రెడ్డికే ఉందన్నారు. ప్రజల్లో ఆయనపై ఉన్న అభిమానాన్ని ఎవ్వరూ చెరపలేరన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలు పూర్తిగా తొలుగుతాయన్నారు. సంక్షేమ పథకాల అమలులో అధికార పార్టీ నాయకులు పక్షపాత ధోరణి అవలంభించడం తగదన్నారు. పార్టీల కతీతంగా సంక్షేమ పథకాల లబ్ధి అందించనప్పుడే ఆ నాయకులకు మంచి పేరు వస్తుందన్నారు. కోడూరుపాడులోని పేదలకు పట్టాలు మంజూరు చేసే తరుణంలో వైయస్ఆర్‌ సీపీకి చెందిన వారి పేర్లను తొలగించేందుకు యత్నిస్తున్నారని ఆరోపంచారు. అర్హులైన వారి పేర్లను తొలగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఈనెల 28వ తేదీ జరిగే విచారణలో జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి రావడం తధ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ విడుదలకు 27వ తేదీన నెల్లూరు నుంచి నరసింహకొండ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాదయాత్ర చేయగలిగిన వారు తనతో పాటు పాదయాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను స్థానిక నాయకులు తమ దృష్టికి తీసుకు వస్తే అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి పాటుపడతామన్నారు.  ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రూరల్ నియోజక వర్గ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరించారన్నారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార బాధ్యతను చేపట్టి ముందుకు సాగడం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రజల కష్టాలను తెలుసుకునే విషయంలో ఎంపీ చూపుతున్న చొరవ ప్రజాభిమానాన్ని చూరగొంటుందని కొనియాడారు.
మాతమ్మ గుడిలో పూజలు: జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి విడుదలను కాంక్షిస్తూ కోడూరుపాడు గ్రామ దళితకాలనీలో మాతమ్మగుడిలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోడ్లు, పెన్షన్‌లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల కేటాయింపు, డ్రైనేజీల కాలువల ఏర్పాటు తదితర సమస్యలపై ఆయనకు ప్రజలు వినతులు అందించారు. సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కర్తం ప్రతాప్‌రెడ్డి, సన్నపరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, స్థానిక నాయకులు లేబూరు పరమేశ్వరరెడ్డి, లేబూ రు సుధాకర్‌రెడ్డి, లేబూరు రమణారెడ్డి, బొమ్మి వెంకారెడ్డి పాల్గొన్నారు.

Back to Top