వైయస్‌ఆర్‌సిపిలోకి టిడిపి ఎమ్మెల్యే సాయిరాజ్

హైదరాబా‌ద్, 20 ఫిబ్రవరి 2013: టిడిపి ఎమ్మెల్యే శిరియా సాయిరాజ్ బుధవారం‌నాడు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు. ‌వైయస్‌ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ‌ గత ఎన్నికల్లో‌ సాయిరాజ్‌ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకర్గం నుంచి టిడిపి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సాయిరాజ్‌తో పాటు శ్రీకాకుళం జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదా‌స్ విజయమ్మతో భేటి అయ్యారు. త్వరలో జరగబోయే స్ధానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని విజయమ్మ ఈ సందర్భంగా సాయిరాజ్కు సూచించారు.

టిడిపి కుట్ర రాజకీయాలతో తాను విసిగిపోయి ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నానని సాయిరాజ్ నాలుగు రోజుల క్రిత‌మే ప్రకటించిన విషయం తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయ‌స్ రాజశేఖరరెడ్డి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని, వాటిని చూసి తాను ‌వైయస్‌ఆర్‌సిపిలో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.
Back to Top