వైయస్ఆర్ కాంగ్రెస్ కోశాధికారి కన్నుమూత

హైదరాబాద్ :

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోశాధికారి పి.ఆర్. కిరణ్‌ కుమార్ రెడ్డి(53) కన్నుమూశారు. కొంతకాలంగా  ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా దామర మడుగు. చిన్నతనం నుంచే సేవాతత్వం కలిగిన కిరణ్‌ కుమార్‌ రెడ్డికి దివంగత మహానేత డాక్టర్  వైయస్‌ రాజశేఖర రెడ్డితో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన వైయస్ఆర్‌కు  వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. ఆరోగ్యశ్రీ వ్యవహారాలను పర్యవేక్షించేవారు. సీఎం రిలీఫ్ ఫండ్‌ నుంచి రోగులకు సాయం అందించారు. కిరణ్ కుమార్ రెడ్డి భౌతిక కాయానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, శ్రీమతి వైయస్. భారతి, వై.వి. సుబ్బారెడ్డి దంపతులు నివాళులర్పించారు. బుధవారం మధ్యాహ్నం 11.30 గంటల ప్రాంతంలో ఆయన భౌతిక కాయాన్ని జూబ్లీ హిల్స్ లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. 12.30 గంటల ప్రాంతంలో అంత్యక్రియల నిమిత్తం ఈఎస్ఐ సమీపంలోని శ్మశాన వాటికకు తీసుకువెళ్ళారు. పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యాలయ సిబ్బంది, కార్యకర్తలు కిరణ్ కుమార్ కు నివాళులర్పించారు.

Back to Top