ఉన్నత విద్యతోనే మంచి అవకాశాలు

ఖమ్మం, 27 ఏప్రిల్‌ 2013: ఫీజు రీయింబర్సుమెంట్ ‌పథకాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ఆరోపించారు. దీనితో విద్యార్థులు చదువు కొనలేకపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. దురదృష్టవశాత్తూ‌ మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ ‌మరణించడంతో పథకాలను ప్రభుత్వం పట్టించుకోవడం మానేసిందని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీమతి షర్మిల శనివారం ఉదయం ఖమ్మంలోని మమత కళాశాల విద్యార్థులను ఉద్దేశించి విద్యా, ఉపాధి అవకాశాలపై మాట్లాడారు. ఉన్నత విద్యతోనే మంచి మంచి అవకాశాలను అందుకోగలమని ఆమె అన్నారు. చదువుతోనే పేదరికాన్ని పారదోలగలమని అన్నారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి స్వయంగా వైద్యుడైనందు వల్లే ప్రజల ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ద తీసుకున్నారని ఆమె అన్నారు. ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాలను ఆయన డాక్టర్‌గా ఆలోచించడం వల్లనే అమలులోకి వచ్చాయని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న తీరును చూసి మహానేత వైయస్‌ఆర్‌ ఎంతగానో సంతోషించేవారన్నారు.

గ్రామీణ విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసుకువచ్చేందుకు, వారికి మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ట్రిపుల్‌ ఐటి లాంటి విద్యాసంస్థలు నెలకొల్పేందుకు మహానేత డాక్టర్ వైయస్‌ ‌రాజశేఖరరెడ్డి ఎంతగానో తాపత్రయపడ్డారని శ్రీమతి షర్మిల తెలిపారు. రాష్ట్రాన్ని మానవ వనరుల రాజధానిగా చేయాలని వైయస్‌ఆర్‌ అనుకున్నారన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్‌ పథకం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్‌ో చదువుకున్న విద్యార్థులు ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థల్లో అధిక మొత్తంలో జీతాలు తీసుకునే ఉన్నత స్థాయి ఉద్యోగులుగా ఉన్నారన్నారు. విద్యార్థులందరూ బాగా చదువుకుని దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడాలని శ్రీమతి షర్మిల ఆకాంక్షించారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే.. మహానేత ప్రారంభించిన ఫీజు రీయింబర్సుమెంట్‌ పథకం సక్రమంగా కొనసాగిస్తారని విద్యార్థులకు శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు. ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదివేలా జగనన్న కృషి చేస్తారన్నారు.

షర్మిల నేటి పాదయాత్ర షెడ్యూల్‌ :
శ్రీమతి చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర జిల్లాలో ఆరవ రోజు 13.3 కిలోమీటర్లు సాగనున్నది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కార్యక్రమాల అమలు కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం‌ ఈ విషయం తెలిపారు. శనివారం ఉదయం మమత వైద్య కళాశాల నుంచి పాదయాత్ర ప్రారంభమై మమత సెంటర్, ఇల్లెందు క్రా‌స్‌రోడ్, ఖానాపురం, కైకొండాయిగూడెం క్రా‌స్‌రోడ్, బల్లెపల్లి మీదుగా శివాయిగూడెం క్రాస్ రోడ్ వరకు ‌కొనసాగుతుందన్నారు. శనివారం రాత్రికి శ్రీమతి షర్మిల శివాయిగూడెం క్రాస్‌రోడ్డు సమీపంలో బసచేస్తారని రఘురాం వివరించారు.

Back to Top