వైయస్‌ జగన్‌పై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం

తాడిమ్రరి: బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమని పార్టీ జిల్లా కార్యదర్శి అగిలే శంకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా తాడిమ్రరిలోని ఆయన స్వగృహంలో గురువారం నాయకులు, కార్యకర్తలతో కలసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా వైయస్‌ జగన్‌ బాధిత కుటుంబాలను పరామర్శించడం తప్పా అని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ను రాజకీయంగా ఎదగనీయకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నాడని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ వడ్డి రామలింగారెడ్డి, నాయకులు అగిలే సాయినాథ్‌రెడ్డి, మహేష్, మారక నరసింహారెడ్డి, గోవిందుగంగులప్ప, జగదానందరెడ్డి, పెదయ్య తదితరులు పాల్గొన్నారు.

Back to Top