జమ్మన ప్రసన్నకుమార్‌ అక్రమ అరెస్టుకు నిరసనగా ధర్నా

పార్వతీపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జమ్మన ప్రసన్న కుమార్‌ అక్రమ అరెస్టుకు నిరసనగా పార్టీ నేతలు సోమవారం బలిజిపేటలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణాపురం ఎంపీటీసీ సభ్యులు మజ్జి శ్రీరామూర్తి మాట్లాడుతూ..టీడీపీ అరాచకాలను బయిటపెడుతున్నారనే భయంతో, అధికార మదంతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మైనింగ్‌ అక్రమ తవ్వకాలపై పోరాడుతున్న ౖపార్వతీపురం నియోజకవర్గ సమన్వయ కర్త జమ్మాన ప్రసన్నకుమార్‌పై కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. బోడికొండ, బడేదేవర కొండలపై గ్రానైట్‌ తవ్వకాలకు అక్రమంగా అనుమతులు ఇచ్చి కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తూ గిరిజనులకు అన్యాయం చేయడంపై గిరిజనులకు ప్రసన్నకుమార్‌ అండగా నిలిచారన్నారు. అక్రమ కేసులు బనాయించడం మానుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు పి.మురళీక్రిష్ణ, బి.తమ్మినాయుడు, ఆర్‌.రమణమూర్తి, కె.వెంకట్రావు, కె.వెంకటరమణ, జి.గోపాల్, డి.శ్రీనివాసరావు, జి.మరియదాసు తదితరులు పాల్గొన్నారు.

Back to Top