విజయవాడః అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి తనపై నమ్మకంతో అప్పగించిన గురుతర బాధ్యతను వమ్ముచేయకుండా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని అధికార ప్రతినిధులుగా నియమితులైన పైలా సోమినాయుడు తెలిపారు. తన నియామకానికి సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా వైయస్సార్సీపీ జెండా రెపరెపలాడించేందుకు, వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే దిశగా ముందుకు పోయేందుకు నా పదవిని పార్టీకి వినియోగిస్తానని అన్నారు. చంద్రబాబు ఎన్నికల వాగ్ధానాలను పక్కనబెట్టి ప్రజాకంఠక పాలన సాగిస్తున్నారని, ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటితంగా ప్రజల్లోకి వెళ్లి టీడీపీ మోసాలను ఎండగడుతామన్నారు. రాబోయే రోజుల్లో వైయస్ఆర్ హయాంలోని స్వర్ణయుగ పాలన జగన్ నాయకత్వంలో సాగుతుందని అన్నారు. రాజన్న ఇచ్చిన వరాలు జగనన్న పాలనలో మళ్లీ కురిపించే దిశగా అందరం కలిసి పనిచేస్తామన్నారు. <br/>