<strong>నెల్లూరు, 15 డిసెంబర్ 2012:</strong> ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ దురాగతాలకు పాల్పడుతోందని నెల్లూరు లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. తాజాగా ఇప్పుడు సహకార సంఘాల ఎన్నికల్లో కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. సహకార ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఇలా వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్రంలో మారిన రాజకీయ వాతావరణంలో ఎలాంటి ఎన్నికలు నిర్వహించినా తనకు ఘోర పరాభవం తప్పదని గ్రహించిన కాంగ్రెస్ ఇలా చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే విజయదుందుభి మోగిస్తుందని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.<br/>కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులపైకి సిబిఐని ఉసిగొల్పి రాజకీయాస్త్రంగా వాడుకుంటోందని మేకపాటి రాజమోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే కుట్రలు పన్ని జైలుకు పంపిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా శ్రీ జగన్ త్వరలోనే బయటకు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.