క్రీడలతో మానసికోల్లాసం

క‌ర్నూలు(బనగానపల్లె) : క్రీడలతో మాన‌సిక ఉల్లాసం క‌లుగుతుంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ‌న‌గాన‌ప‌ల్లె మండ‌ల‌ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు గుండం నాగేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా మండలస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా గుండం నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో కూడ ప్రతిభ గల క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారన్నారు. ఈ టోర్నమెంట్‌ క్రీడాకారులు ప్రతిభను చూపేందుకు దోహదం చేస్తాయన్నారు. అనంత‌రం విజేత‌ల‌కు బ‌హుమ‌తులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అనిల్‌ కుమార్, మనోహర్, సునీల్, వై. మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top