రాయలసీమను బాబు ఎడారిగా మారుస్తున్నాడుసీమ ప్రాజెక్ట్ లకు తీవ్ర అన్యాయం జరుగుతోందిశ్రీశైలం జలాశయంలో 854 లెవల్ మెయింటైన్ చేయాలిఈసారైనా ఖరీఫ్ కు నీళ్లు అందించాలికృష్ణా బోర్డు ఆఫీసు కర్నూలులో నెలకొల్పాలి
హైదరాబాద్ః టీడీపీ పాలనలో రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతోందని వైయస్సార్సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల లెవల్ మెయింటైన్ చేయకుండా దిగువకు నీళ్లు తోడుకుపోతూ చంద్రబాబు సీమను ఎడారిగా మారుస్తున్నారని వారు మండిపడ్డారు. రాయలసీమలోని ప్రాజెక్ట్ లకు నీళ్లు వదలాలని, హంద్రీనీవా ఆయకట్టుకు న్యాయం చేయాలని, కృష్ణా బోర్డుకు సంబంధించిన ఆఫీసు కర్నూలులో నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ... హైదరాబాద్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శిలను కలిసి కోరారు. ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, రఘురామిరెడ్డి, గౌరు చరితారెడ్డి, ఇతర నేతలు ఉన్నతాధికారులను కలిశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వారు ఏమన్నారంటే...

వైయస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డిరాష్ట్రం విడిపోయిన తర్వాత రాయల సీమ ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.గాలేరు, నగరి, హంద్రీవా ప్రాజెక్టులు మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 80 శాతం పనులు పూర్తయినా మిగిలిన పనులను పూర్తి చేసే జాడ కనిపించడం లేదుశ్రీశైలం ప్రాజెక్టు లో పవర్ జనరేషన్ పేరిట 92 టీఎంసీల నీటిని దిగువకు వదలడం వల్ల నీటి లెవెల్స్ పడిపోయి కేసీ కెనాల్, తెలుగు గంగ ప్రాజెక్టులకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత రెండు సంవత్సరాల అనుభవంతో రాయలసీమ ప్రాజెక్టులకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీశైలంలో 854 అడుగుల లెవెల్స్ మెయిన్‌టెయిన్ చేయాలి.874 అడుగులు వచ్చేవరకు దిగువకు నీటిని వదలకూడదు. 854 లెవెల్ వచ్చిన వెంటనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా గాలేరు నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులకు నీరు వదలాలి.హంద్రీనీవా ప్రాజెక్టు లెవెల్స్ పరిమిట్ చేసిన వెంటనే నీరు వదలి సీమ ప్రజలకు న్యాయం చేయాలి. కృష్ణా బోర్డుకు సంబంధించిన ఆఫీసును కర్నూల్ లోనే ఏర్పాటు చేయాలి. గుండ్రేవుల ప్రాజెక్టు మంజూరు చేయాలి. గుండ్రేవుల ప్రాజెక్ట్ వస్తే కేశీయ ఆయకట్టు స్థిరీకరణకు వీలు కలుగుతుంది. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులపై కర్నూలులో అధ్యక్షులు వైయస్ జగన్ నిరాహార దీక్ష చేశారు.ఈ విషయంలో అధికారపార్టీ ఓటుకు నోటు కేసుకు భయపడి నోరు మెదపడం లేదు.వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి
చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టనప్పటి నుంచి రాయలసీమ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతోంది. బాబు కడప జల్లాలో పర్యటించినప్పుడల్లా గండికోట రిజర్వాయర్‌కు నీరందిస్తామని కథలు వల్లిస్తున్నారే తప్ప నీరందించడం లేదు.బ్రంహ్మంగారి మఠం రిజర్వాయర్ కు వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 9 టీఎంసీల నీరు ఇచ్చారు.ప్రాజెక్టులకు చెందాల్సిన నీరు సముద్రంలో కలుస్తుందే తప్ప బ్రంహ్మంగారి మఠం, తెలుగు గంగ ప్రాజెక్టుల్లో బాబు వచ్చాక చుక్క నీరు చేరడం లేదు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాఘురాంరెడ్డికేసీ కెనాల్, గాలేరు - నగరి, తెలుగుగంగ డ్యాంలకు శ్రీశైలం నీటిని విడుదల చేయాలి. ఖరీఫ్‌కు నీరు అందివ్వాలి.ఖరీఫ్ సీజన్ పూర్తయ్యే వరకు జలాశయంలో 874 లెవల్ ను నిలబెట్టాలి.. లేనిపక్షంలో రాయలసీమ ప్రాంతం తీవ్రంగా నష్టపోతుంది.గత ఏడాది తెలుగుగంగ, గాలేరు - నగరికి చుక్క నీరు రాలేదు... రాయలసీమ ఎడారిగా మారే అవకాశం ఉంది. రాయలసీమకు నీరును కేటాయించకపోతే పోరాటాలు చేయక తప్పదువైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గౌరిచరితా రెడ్డి
గత రెండేళ్లుగా వర్షాలు లేక రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారుతుందికనీసం ఈ ఏడాదైనా శ్రీశైలం నుంచి నీటిని కేటాయించాలితుంగభద్ర డ్యాం నుంచి 10 టిఎంసీల నీరు అనంతపురం తరలించడం వల్ల కేసీ కెనాల్‌కు నీరు రాక ఎంతో నష్టపోయాం. ఇప్పటికైనా త్వరితగతిన నిధులు కేటాయించి గుండ్రేవుల ఆనకట్టను పూర్తి చేయాలి. కృష్ణా రివర్‌బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలి. 2007లో దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పైన వెలగమాన్ డ్యాంను రూ. 10 కోట్లతో మంజూరు చేశారు.డ్యాం వచ్చిన తర్వాత జెఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఏర్పాటు చేయడం వల్ల వెలగమాన్ డ్యాం నిలిచిపోయింది.వెలగమాన్ డ్యాం పూర్తయ్యితే ఏడు మండలాలు సస్యశామలంగా మారతాయి.వైయస్సార్ సీపీ నాయకుడు శంకర్‌నారాయణ
రెండేళ్లుగా వర్షాలు లేక రాయలసీమ ప్రాంతం కరువుతో తాండవిస్తోంది...ఈ సంవత్సరమైనా ప్రభుత్వం రాయలసీమకు నీళ్లు ఇవ్వడంలో న్యాయబద్ధంగా వ్యవహరించాలినదులను అనుసంధానం చేయడం కాదు... ఉన్న ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వండి చాలు.