ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సంతాపం

వైయస్‌ఆర్‌ జిల్లా: కమలాపురం పట్టణంలోని పడమటివీధిలోని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు వల్లెల ప్రభాకర్‌రెడ్డి( పెద్దిరెడ్డి) రెండవ కుమారుడు నాగేంద్రరెడ్డి ఆనారోగ్యంతో మృతి చెందడం పట్ల ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మృతుడి స్వగృహానికి చేరుకొని భౌతికకాయానికి నివాళులర్పించారు. ఎమ్మెల్యేతో పాటు మండల వైయస్‌ఆర్‌సీపీ నాయకులు సి.ఎస్‌.నారాయణరెడ్డి, సుమీత్రా రాజశేఖర్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మారుజొళ్ళ శ్రీనివాసులరెడ్డి, మండల రైతు విభాగం అధ్యక్షుడు మారుజొళ్ళ మునిరెడ్డి, అధికార ప్రతినిధి అల్లె రాజారెడ్డి, ట్రెజరర్‌ సుదాకొండారెడ్డి, జిల్లా స్టీరింగ్‌ కమీటి సభ్యుడు నారధా గఫార్‌బాష, పి.వి. కృష్ణారెడ్డి, అంబటి సురేష్, ఖాజాహుస్సేన్, ఖాజాపీర్‌ తదితరులు మృతునికి నివాళలర్పించారు.  

Back to Top