వైయ‌స్ జగన్‌కు పోసాని మ‌ద్ద‌తు

 
 పశ్చిమ గోదావరి జిల్లా  : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు,  ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి కలుసుకున్నారు. జననేతతో కలిసి పాదయాత్రలో పాల్గొని వైయ‌స్‌ జగన్‌కు మద్దతు తెలిపారు పోసాని. అంతకుముందు వైయ‌స్‌ జగన్‌ 172వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. శనివారం ఉదయం నైట్‌ క్యాంపు(ఆకివీడు) నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైయ‌స్‌ జగన్‌... కుప్పన పుడి, కోలనపల్లి  మీదుగా కొనసాగనున్న పాదయాత్ర కాళ్ల చేరుకున్నాక విరామం తీసుకుంటారు. 
తాజా ఫోటోలు

Back to Top