ఖాకీల దౌర్జన్యం

విజయవాడ: కృష్ణా జిల్లా జి. కొండూరు మండలంలో వైయస్‌ఆర్సీపీ నేతలకు పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి. మట్టి వివాదంలో పామర్తి సాంబశివరావు, వంశీ అనే వైయస్సార్‌సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు పోలీస్‌స్టేషన‍్లకు తిప్పుతూ వేధింపులకు గురిచేస్తున్నారు. మంత్రి దేవినేని ఉమ ఆదేశాలతోనే పోలీసులు అత్యుత్సాహం చూపుతూ వైయస్సార్‌సీపీ నేతలను కావాలని వేధిస్తున్నారని  మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఆరోపించారు. పోలీసుల దాష్టీకానికి నిరసనగా ఆయన జి.కొండూరు పోలీసు స్టేషన్‌ ఎదుట  ఉదయం ఆందోళనకు దిగారు. వైయస్సార్‌సీపీ నేతలను తక్షణం విడుదల చేయాలని, అంతవరకూ ఆందోళన ఆగదని ఆయన హెచ‍్చరించారు. 

Back to Top