వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

ఏపీ అసెంబ్లీ:  వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం డిమాండ్‌ చేశారు. జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ..వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏళ్ల తరబడి ఉద్యమిస్తున్నారని చెప్పారు. ఏపీలోని. 5 జిల్లాల్లో వాల్మీకులు ఎస్టీలుగా ఉండగా, 8 జిల్లాల్లో బీసీలుగా ఉన్నారని తెలిపారు. కర్ణాటకలో కూడా వాల్మీకులు ఎస్టీలుగా ఉన్నారు. పక్క రాష్ట్రంలో చదువుతున్న నా కుమారుడు ఎస్టీ జాబితాలో ఉంటే, నేను మాత్రం బీసీగా ఉన్నాను. బీసీలకు 139 కులాలు ఉన్నాయి. బీసీలకు రూ.35 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. వాల్మీకులకు కుల వృత్తి లేదు. వాల్మీకి సంక్షేమానికి వేయ్యి కోట్లు కేటాయించాలని జయరాం కోరారు

Back to Top