ఫిబ్రవరిలో షర్మిల పాదయాత్ర!


హైదరాబాద్, 26 జనవరి 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల ఫిబ్రవరి మొదటి వారంలో పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉందని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. మోకాలి గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న శ్రీమతి షర్మిల పూర్తిగా కోలుకున్నారని అన్నారు. శ్రీమతి షర్మిల పాదయాత్రపై పార్టీలో చర్చించి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వాసిరెడ్డి పద్మ అన్నారు. వీలైనంత త్వరలో పాదయాత్ర ప్రారంభించాలనే ఉద్దేశంతో శ్రీమతి షర్మిల ఉన్నారన్నారు.

కుదుటపడిన షర్మిల ఆరోగ్యం

      దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల ఆరోగ్యం కుదుటపడింది. శ్రీమతి షర్మిల నడవ గలిగే స్థితిలో ఉన్నారని ఆమెను పరీక్షించిన వైద్యులు తెలిపారు. శనివారంనాడు అపోలో వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మోకాలి గాయంతో బాధపడుతున్న శ్రీమతి షర్మిలకు డిసెంబర్ 18వ తేదీన వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అప్పటి నుంచి శ్రీమతి షర్మిల విశ్రాంతి తీసుకుంటున్నారు.

     వైద్యుల సలహా కోసం ఆమె అపోలో ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ చంధ్రశేఖరరెడ్డి, మరో డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి శ్రీమతి షర్మిలకు పరీక్షలు నిర్వహించారు.  ప్రస్తుతం ఎలాంటి ఆసరా లేకుండా శ్రీమతి షర్మిల నడవొచ్చని డాక్టర్లు చెప్పారు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నారన్నారు.  కొన్ని రోజుల పాటు ఉదయం, సాయంత్రం ఫిజియోథెరపీ కొనసాగించాల్సి ఉంటుందన్నారు.

Back to Top