పేదల నోట్లో మట్టి కొడుతున్న ప్రభుత్వం..!

కుంటిసాకులు చెప్పి రేషన్ రద్దు..!
సబ్సిడీ భారం తగ్గించునేందుకు కుట్ర..!

ఏపీలో చంద్రబాబు సర్కార్ మరో కుట్రకు తెరలేపింది. ఆర్థికభారాన్ని తగ్గించుకునే పనిలో భాగంగా రేషన్ కార్డులకు ఎసరు పెట్టింది.ఆధార్ లేదని , ఈ-పాస్ మిషన్లకు వేలిముద్రలు సరిపోవడం లేదని రకరకాల కారణాలతో రేషన్ ను నిరాకరిస్తోంది. అడ్డగోలుగా కోతలు పెడుతూ  నిరుపేదల నోట్లో మట్టి కొడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.1.30 కోట్ల మంది  తెల్లరేషన్ కార్డులు కలిగియున్నారు. రేషన్ కార్డుల్లో పేరు నమోదై ఉన్నప్పటికీ కుంటిసాకులు చెబుతూ 75.57 లక్షల మందిని నిర్ధాక్షిణంగా తొలగించేశారు.  

కుంటిసాకులు చెప్పి పొట్టగొడుతున్నారు..!
అలా  తొలగించిన రేషన్ ద్వారా ప్రతినెల 35 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా అవుతోంది. ఏటా రూ. వేయి కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుతోంది. అధికారుల నుంచి రేషన్ డీలర్ దాకా అవినీతి జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం..పేదల మీద ప్రతాపం చూపుతోంది. ఏ ఆధారం లేని అంత్యోదయ అన్న యోజన పథకం ఉన్న వారి పరిస్థితి, అందులో వృద్ధుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తమ    పొట్టగొట్టడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన చెందుతున్నారు. 

లోటుపాట్లు సరిదిద్దకుండా మిగులుబాటుకు ప్రయత్నాలు..!
కుటుంబంలో ఐదుగురు సభ్యులుంటే ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఇస్తారు. ఐతే, ఏదో ఒక కారణంతో ఆకుటుంబానికి రేషన్ లో కోత పెడుతున్నారు. లోటుపాట్లను సరిదిద్దకుండా క్షేత్రస్థాయిలో ఇదే విధానాన్ని అమలు చేయాలంటూ చంద్రబాబు అధికారులకు చెప్పడం దారుణం. రాష్ట్రవ్యాప్తంగా అంత్యోదయ అన్న యోజన పథకం కింద 9.43 లక్షల కార్డులుంటే వారందరికీ 35 కిలోలు, అన్నపూర్ణ పథకం లబ్ధిదారులైన 12,914 మందికి నెలకు 10 కిలోలు, 2,470 మంది చేనేత కార్మికులకు 25 కిలోలు ఉచితంగా బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా ..ఆభారాన్ని కూడా తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టడం బాధాకరం.  

తాజా వీడియోలు

Back to Top