కసుమూరు(వెంకటాచలం): కొత్తగా మంజూరైన ఫించన్లను ప్రజాప్రతినిధుల చేత పంపిణీ చేయాల్సి ఉండగా సర్పంచ్ భర్త చేత ఎలా పంపిణీ చేయిస్తారని మండల ఉపాధ్యక్షులు వల్లూరు శ్రీధర్‌నాయుడు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కసుమూరు గ్రామంలో శనివారం వైయస్‌ఆర్‌సీపి నాయకులతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కసుమూరు గ్రామానికి నూతనంగా 38ఫించన్లను మంజూరు చేశారని తెలిపారు. అయితే గ్రామ కార్యదర్శి వీరయ్య ఎంపీటీలకు సమాచారం ఇవ్వకుండా సర్పంచ్ భర్తచే త ఫించన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీటీసీలు ఉన్నారనే కారణంతోనే సమాచారం ఇవ్వకుండా పంపిణీ కార్యక్రమం చేశారని మండిపడ్డారు. అర్హులైన పేదలకు ఫించన్ల మంజూరు చేసేందుకు తాము ఎప్పుడూ సహకరిస్తామని తెలియజేశారు. అయితే కొందరు టిడిపి నాయకులు అవాస్తవాలు చెబితే వినే పరిస్థితిలో కసుమూరు గ్రామ ప్రజలు లేరని అన్నారు. ఈసమావేశంలో జిల్లా కోఆప్షన్‌సభ్యులు అక్భర్‌భాష, మండల కోఆప్షన్‌సభ్యులు హుస్సేన్, వైఎస్‌ఆర్‌సీపి మైనార్టీసెల్‌నాయకులు కరీంసాహెబ్‌తదితరులు పాల్గొన్నారు.