హైదరాబాద్ 08 జూలై 2013: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. జయంతి వేడుకలను పురస్కరించుకుని అనేక ప్రాంతాల్లో మహానేత అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వివిధ సంక్షేమ సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైయస్‌ఆర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, దండేపల్లిలలో పార్టీ నేత జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను చేపట్టారు. బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రిలో రోగులకు ఆయన పండ్లు అందజేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం వెల్లంకినగర్లోని దివంగత మహానేత విగ్రహానికి వైయస్ వివేకానందరెడ్డి సోమవారం ఉదయం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనార్థనరెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కడప పట్టణంలో: వైయస్ఆర్ జిల్లా కన్వీనర్ సురేష్ బాబు, మాజీ మేయర్ రవీంద్రనాధ్ రెడ్డి, కడప ఇన్చార్జి అంజాద్ బాష, తదితరులు కడప జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహానేత విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రక్తదానం, అన్నదానం కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి రాజంపేటలో వైయస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పోరుమామిళ్లలో డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ జయంతి వేడుకలు చేపట్టారు. రైల్వేకోడూరులో మహానేత విగ్రహానికి ఎమ్మెల్యే కె. శ్రీనివాసులు క్షీరాభిషేకం చేశారు. ఆస్పత్రిలో రోగులకు పండ్లు అందజేశారు. ప్రొద్దుటూరులో రాచమళ్లు ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో దివంగత మహానేత విగ్రహానికి క్షీరాభిషేకం, రోగులకు పండ్లు పంపిణీ, అనాథశ్రమంలో అన్నదానం చేశారు.

వరంగల్: జిల్లా హన్మకొండలోని లెప్రసీ కాలనీలో వైయస్ఆర్ కాంగ్రెస్ నేత కల్యాణ్ రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వైయస్‌ఆర్ పార్టీ నేత జాషువ మదర్ థెరిస్సా ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో వైఎస్ఆర్ చిత్రపటానికి భూమా నాగిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. వైయస్ఆర్ జంక్షన్‌లో మహానేత విగ్రహానికి కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.

రాజమండ్రిలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో వైయస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బొమ్మన రాజ్కుమార్, ఆదిరెడ్డి అప్పారావు కేక్ కట్ చేశారు. అనపర్తిలో డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, వీర్రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. హాస్టల్ విద్యార్థులకు పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. విశాఖ జిల్లా చోడవరంలో బలిరెడ్డి సత్యారావు, దేవరాపల్లిలో ముత్యాలనాయుడు, మాడుగులలో పూడి మంగపతిరావు ఆధ్వర్యంలో ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా చేపట్టారు.