గుడుపల్లె: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేద విద్యార్థుల ఆశాజ్యోతి అని వైయస్ఆర్ సీపీ కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జి, జెడ్పీ మాజీ చైర్మన్ ఎం.సుబ్రమణ్యంరెడ్డి పేర్కొన్నారు. శాంతిపురం మండలం జీడిమానిపల్లెలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో పేద విద్యార్థుల సంక్షమం కోసం పాటుపడిన ఏకైక వ్యక్తి వైయస్ రాజశేఖరరెడ్డి అన్నారు. ఆయన హయాంలోనే రాష్ట్రంలో విద్యాభివృద్ధి జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు జయరాం, ఆంజినేయరెడ్డి, గుడుపల్లె ఎస్సీ సెల్ అధ్యక్షుడు జీకే మూర్తి, మండల పార్టీ కన్వీనర్ రఘురామిరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు గంగాధరం, మైనారిటీ అధ్యక్షుడు నిస్సార్, స్థానికులు చంద్రబాబునాయుడు, చిన్నప్ప, సోమరామిరెడ్డి, కోదండరెడ్డి, భద్రప్ప, చలపతి, రాధారెడ్డి, లోకేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీడిమానిపల్లెకు చెందిన 50 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు సుబ్రమణ్యంరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యవుంత్రిగా ఉండి ప్రజలపై పెనుభారం వేసి మళ్లీ ఇప్పుడు పదవీకాంక్షతో పాదయూత్ర చేస్తున్నారని సుబ్రవుణ్యంరెడ్డి విమర్శించారు. గుడుపల్లె, చీకటిపల్లె, కాడేపల్లె గ్రామాలలో గడపగడపకూ వైయస్ఆర్ సీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి త్వరగా విడుదల కావాలని కాడేపల్లెలోని శివాలయుంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైయస్ కుటుంబంతోనే ఉంటాం: యువజన నేతలుమంగళం: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతోనే ఉంటామని యువజన నేతలు స్పష్టంచేశారు, తిరుపతిలోని పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం తిరుపతి నగర శాఖ సర్వసభ్య సమావేశం ఏర్పాటైంది. నగర కన్వీనర్ షేక్ ఇమాం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే తనయుడు భూమన అభినయ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశంలో ప్రసంగించిన పలువురు నాయకులు వైయస్‌ఆర్ కుటుంబానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దళితుల అభ్యున్నతికి కృషిచేసిన వైయస్గుంటూరు: స్థానిక ఎన్నికలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. 33వ డివిజన్‌లోని గుజ్జనగుండ్లలో పార్టీ ఎస్సీ సెల్ నగర కన్వీనర్ వై. విజయ్‌కిషోర్, సీహెచ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో సామాన్య ప్రజలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల అభ్యున్నతికి వైయస్ కృషిచేశారని, అధికారం దాహంతో అందలమెక్కాలన్న ఆశతో అమలుకు నోచుకోని విధంగా చంద్రబాబు పాదయాత్రలో ఇస్తున్న వరాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. జననేత జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణ చూసి, రెండు పార్టీల నేతల వెన్నులో వణుకు మొదలైందని చెప్పారు. దళితుల అభ్యున్నతికి ఆనాడు వైయస్ఆర్, నేడు జగన్ కృషిచేస్తున్నారని, రాష్ట్రంలో తిరిగి రాజన్న రాజ్యం నెలకొల్పుతారని అప్పిరెడ్డి తెలిపారు.