బాబుతో రాష్ట్రానికి ఒరిగేదేమిలేదు

వైయ‌స్ఆర్ జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాష్ట్రానికి ఒరిగేదేమిలేదని రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే ద్వారకనాధరెడ్డిలు విమర్శించారు. గురువారం గాలివీడు మండల నాయకుడు, వ్యాపారవేత్త తంగాల వెంకటేశ్వర్లు కుమారుడు శ్రీహరిబాబు, ఉజ్వల వివాహానికి వారు హాజరై వధువరులను ఆశీర్వదించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఒక్క ప్రయత్నం కూడా చేయలేదన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమం ఓట్లు దండుకోవడానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లుకాదు, 10 సంవత్సరాలు తెస్తానన్నా చంద్రబాబు నేడు ఆ ఊసే ఎందుకు ఎత్తడం లేదన్నారు. నిధులు దిగమింగవచ్చునని చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజివైపు మొగ్గుచూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యమైన  రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు కేంద్రంపై ప్రత్యేక హోదా గురించి ఒత్తిడి చేయలేదో, రాష్ట్రప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రతి పక్ష నేత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రం కష్టాలలో ఉందంటూ అమరావతికి విరాళంగా ఉద్యోగుస్ధుల దగ్గర స్వీకరించారని, చంద్రబాబు మాత్రం విశాలమైన భవనాలలో, విమానాలలో, తిరుగుతున్నారని ద్వజమెత్తారు. కరువు కాటకాలలో పంటలు చేతికి రాక, వర్షాలు సకాలంలో రాక రైతులు సతమతం అవుతున్న తరుణంలో రైతులను ఆదుకోవాల్సింది పోయి విశాలమైన జీవితాన్ని విదేశాలలో గడపడానికే పరిపాలనకాలం అంతా సాగిపోతుందన్నారు.   కార్యక్రమంలో జిల్లా లీగల్‌సెల్‌ అధ్యక్షులు జల్లా సుదర్శన్‌రెడ్డి, మండల  నాయకులు యద భూషణ్‌రెడ్డి, పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఆవుల నాగభూషణంరెడ్డి, రాష్ట్ర యూత్‌ కార్యదర్శి గుమ్మా అమర్‌నాధరెడ్డి, సర్పంచ్‌ సంఘం అధ్యక్షులు ఉమాపతిరెడ్డి, మండల బీసీ సెల్‌ అధ్యక్షులు వల్లపు నాగేష్, కోఆఫ్షన్‌ మెంబర్‌ మహమ్మద్‌సాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top