అవిశ్వాస తీర్మానం నోటీసు సమర్పణ

హైదరాబాద్) అసెంబ్లీ
స్పీకర్ పక్షపాత ధోరణికి నిరసనగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం
నోటీసును అందచేశారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ నోటీసును అందచేశారు.
డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ నాయకత్వంలోని ఎమ్మెల్యేలు దీన్ని అందచేశారు.
సభలో స్పీకర్ అనుసరిస్తున్న పక్షపాత ధోరణికి నిరసనగా ఈ నోటీసును అందచేశారు. సభ
ప్రోరోగ్ కాలేదని కాబట్టి సభ ను నిబంధనలకు అనుగుణంగా సమావేశం ఏర్పాటు చేసి, దీనిపై
చర్చించాలని కోరారు. 

Back to Top