లెక్కలేవి చంద్రబాబూ..!() రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం కాకిలెక్కలు

() వందల కోట్ల రూపాయిలు ఆరగించేస్తున్న పచ్చ ప్రభుత్వం

() రాజధాని లెక్కలపై నిలదీసిన ఎమ్మల్యేలు బుగ్గన రాజా, ఆర్కే

హైదరాబాద్) అమరావతి రాజధాని పేరు చెప్పి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆళ్ల రామక్రిష్ణారెడ్డి అసెంబ్లీలో బట్ట బయలు చేశారు. రూ. 850 కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారని, ఆ డబ్బంతా ఎక్కడకు పోయిందని సూటిగా ప్రశ్నించారు. దీని మీద జవాబు చెప్పలేక ప్రభుత్వం ఎప్పటిలాగే దూషణలకు దిగింది.

ప్రణాళిక ఉందా బాబూ..!

   రాజ‌ధానికి సంబంధించి అసలు సమగ్ర నివేదిక ఉందా అని ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డి  ప్రభుత్వాన్ని ప్ర‌శ్నించారు. ఈ రెండేళ్ల‌లో దాదాపు 30 నుంచి 40వేల ఎక‌రాలు రైతుల నుంచి భూములు సేక‌రించార‌న్నారు. కానీ సింగపూర్, ముంబై ను మించిన నగరాల పేరు చెబుతున్నారు కానీ ఇందుకోసం డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ఉందా లేదా అని నిలదీశారు.

రాజ‌ధాని నిర్మాణం కోసం అసలు ఎన్ని నిధులు ఖ‌ర్చు చేస్తార‌ని..? ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత‌మేర నిధులు ఖ‌ర్చు చేశార‌ని..?  ప్ర‌స్తుతం రాజ‌ధాని కోసం ఉన్న నిధులు ఎన్ని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. అందులో కొండ‌వీటి వాగు పొంగితే దాదాపు 13వేల ఎక‌రాలు మునిగిపోతాయ‌ని, కేవ‌లం రెండు మీట‌ర్ల ఎత్తు పెంచ‌డానికి 1,500 కోట్లు ఖ‌ర్చవుతుంద‌ని చెబుతున్నారు. తిరుప‌తి, సెక్ర‌టేరియ‌ట్‌ల‌లో రాజ‌ధాని నిధుల సేక‌ర‌ణ అంటూ హుండీలు పెడుతున్నారు. ఆన్ లైన్ లో ఇటుక‌లు, పిల్ల‌ల నుంచి విరాళాలు తీసుకుంటున్నారు

రాజ‌ధాని కోసం ఇప్ప‌టి వ‌ర‌కు ఖ‌ర్చు చేసిన లెక్క‌లు చెప్పాలి అని డిమాండ్ చేశారు.

ఖర్ఛులకు లెక్కలేవి బాబూ..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిలో మొత్తం 850 కోట్లు ఖ‌ర్చు పెట్టార‌ని అవి ఎందుకు ఖ‌ర్చ‌య్యాయో ప్ర‌భుత్వం ఇంత‌వ‌ర‌కు తెలియ‌జేయలేద‌ని   వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ప్రశ్నించారు. రాజ‌ధాని విష‌యంలో ప్ర‌భుత్వం   స‌భ‌ను త‌ప్పుదారి మ‌ళ్లిస్తోంద‌ని ఆరోపించారు. అమిత్‌షా వ‌చ్చిన‌ప్పుడు రూ. 500 కోట్ల రూపాయ‌ల‌ను రాజ‌ధానికి కేటాయించామ‌న్నార‌ని, కేంద్ర ప్ర‌భుత్వం 2200 కోట్లు ఇచ్చామ‌ని చెబుతున్నార‌న్నారు. తాత్కాలిక రాజ‌ధానికే రూ. 200 కోట్లు ఖ‌ర్చుపెడుతున్నార‌ని,    ఇక శాశ్వ‌త రాజ‌ధానికి నిధులు ఎక్క‌డి నుంచి తెస్తార‌ని ప్ర‌శ్నించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్కరికి కూడా ఫించ‌న్ మంజూరు చేయ‌క‌పోవ‌డం క‌రెక్టేనా అని ప్ర‌శ్నించారు. సింగపూర్ వాళ్లు ఉచితంగానే మాస్ట‌ర్‌ప్లాన్ ఇచ్చార‌ని చెబుతున్న చంద్ర‌బాబు .. తిరిగి వారికి డ‌బ్బులు చెల్లించ‌డం ఏమిట‌న్నారు. ఇప్ప‌టికైనా రాజ‌ధాని కోసం ఎంత‌మేర వ‌ర‌కు డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టారో లెక్క‌ చెప్పాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు. 

 

Back to Top