- వైయస్‌ఆర్ జిల్లాః ఏపీలో నిరుద్యోగ సమస్యలపై వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం దీక్షలు కొనసాగుతున్నాయి. వైయస్‌ఆర్ జిల్లాలో అంబేద్కర్ సెంటర్‌లో వైయస్‌ఆర్ విద్యార్థి విభాగం నేతల 48 గంటల దీక్షలు చేపట్టారు. ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజాద్ బాషా, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఖాజారం హంతుల్లా తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో 48 గంటల దీక్షలను కృష్ణా జిల్లా వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నేతలు ప్రారంభించారు. అనంతపురం టూటౌన్ పీఎస్‌లో వైయస్‌ఆర్ విద్యార్థి విభాగం నేతలను మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి,ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, పరాశురాం తదితరులు పరామర్శించారు. తిరుపతి ఎస్వీయూలో వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం 48 గంటల దీక్ష చేపట్టింది. శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్‌లో వైయస్‌ఆర్‌సీపీ, విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో 48 గంటల దీక్ష చేపట్టారు. వైయస్‌ఆర్‌సీపీ నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, ప్రధాన రాజేంద్ర, మెంటాడ స్వరూప్ తదిరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ ఓటుకు కోట్లు కేసు భయంతోనే ప్రత్యేకహోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని విమర్శించారు. .అవుట్‌సోర్సింగ్ పోస్టులను టీడీపీ నేతలు అమ్ముకున్నారని ఆరోపించారు. పెట్టుబడుల పేరుతో విదేశీ పర్యటనలకు వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు.