ముస్లింలు మంత్రి పదవికి పనికిరారా బాబూ?

అనంతపురం: చంద్రబాబు మైనార్టీలను చిన్నచూపు చూస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మహ్మద్‌ ఇక్బాల్‌ ధ్వజమెత్తారు. మంత్రి పదవికి ముస్లింలు పనికిరారా? అని ప్రశ్నించారు. అనంతపురం జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ముస్లింలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో లేనిపోని హామీలిచ్చి ఓట్లు దండుకున్న తరువాత ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ వల్లే మైనార్టీల సంక్షేమం సాధ్యమని ఇక్బాల్‌ అన్నారు. ఒక్కసారి వైయస్‌ జగన్‌కు అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపిస్తారన్నారు. వైయస్‌ జగన్‌తో రాజన్న రాజ్యం సాధ్యమన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top