ముస్లిం రిజర్వేషన్లు వైయస్‌ఆర్ చలవే: పెనుమత్స

విజయనగరం: ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిం చిన ఘనత మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు అన్నారు. పట్టణంలోని 22వ వార్డుకు చెందిన వంద మైనార్టీ కుటుంబాలు ఆ పార్టీ నాయకుడు గురాన అయ్యలు సమక్షంలో మంగళవారం వైఎస్‌ఆర్ సీపీలో చేరాయి. ఈ సందర్భంగా పెనుమత్స వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ముస్లింలు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నిలవడం ఆనందంగా ఉందన్నారు. దివంగత నేత అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందజేస్తే ప్రస్తుత సర్కార్ వాటికి తిలోదకాలు ఇస్తుందన్నారు. వైయస్‌ఆర్ సీపీ బలోపేతానికి మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. మైనార్టీ నాయకులు మహ్మద్ నాసిర్ మాట్లాడుతూ మహానేత మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించి సముచిత స్థానం ఇచ్చారని చెప్పారు. అందువల్ల జగన్ స్థాపించిన వైయస్‌ఆర్ కాంగ్రెస్ వెంటే నడుస్తామన్నారు. భవిష్యత్‌లో పార్టీ బలోపేతానికి మరింత కృషి చే స్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో పి.సాగర్, మహ్మద్ సాకేబ్, మహ్మద్ షలీల్, శేఖర్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ గొర్లె వెంకటరమణ, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ ఆదాడ మోహనరావు, నామాల సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Back to Top