కాపుల రిజర్వేషన్ పై కాలయాపన

చంద్రబాబు వంకర మాటలు మానుకో
కాలయాపన కోసమే కమిషన్
చంద్రబాబుకు ముద్రగడ లేఖ

హైదరాబాద్ః
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చంద్రబాబుపై మండిపడ్డారు. వంకర మాటలు
మానుకోవాలని హితవు పలికారు.చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే కాపులను
బీసీల్లో చేర్చాలని... కమిషన్ పేరుతో కాలయాపన చేయడం సరికాదని ముద్రగడ
లేఖాస్త్రాన్ని సంధించారు. కాపుల సంక్షేమానికి ఏటా వేయికోట్ల చొప్పున,
ఐదేళ్లలో 5 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి చంద్రబాబు వారిని మోసం
చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే కాపులు ప్రభుత్వంపై ఉద్యమానికి
సిద్ధమవుతున్నారు. 

కమిషన్ వేస్తే రిపోర్టు
రావడానికి మరో జన్మ ఎత్తాల్సి వస్తుందని ముద్రగడ ఎద్దేవా చేశారు. కమిషన్లు,
జీవోల పేరుతో వంకలు పెడుతున్నారని... మీకు చిత్తశుద్ధి ఉందా అని
చంద్రబాబును .... ముద్రగడ సూటిగా ప్రశ్నించారు. జనాభాకు సంబంధించిన అన్ని
వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని నెలరోజుల్లో కాపులను బీసీల్లో
చేర్చొచ్చని ప్రభుత్వానికి సూచించారు. తమ పోరాటం కాపుల్లోని పేదల కోసమేనని
ఆయన తెలిపారు. కాపుల ఉద్యమానికి స్ఫూర్తి ఎవరో మీకు తెలియదా అని ముద్రగడ
చంద్రబాబుని ప్రశ్నించారు. గతంలో మీ మద్దతుతోనే తాను ఉద్యమం చేశానని
ముద్రగడ బాబుకు గుర్తు చేశారు.

అధికారంలోకి
వచ్చిన ఆరు నెలల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు....
అధికారం చేపట్టి 18 నెలలు గడిచిందని కానీ హామీలు నెరవేర్చకుండా కమిషన్
పేరుతో కాలయాపన చేయడం సరికాదని ముద్రగడ తన లేఖలో  పేర్కొన్నారు. కాపులను
వెనుకబజిన తరగతుల్లో చేర్చేవిషయాన్ని పరిశీలించేందుకు కమిషన్ ఏర్పాటు
చేయాలని నిర్ణయించిన సర్కార్...తొమ్మిది నెలల్లో నివేదిక ఇవ్వాలంటూ కాలయాపన
పనులకు సిద్ధమైంది. కాపులను బీసీల్లో చేర్చడంపై ప్రభుత్వం ఆలస్యం చేస్తే..
త్వరలో తునిలో నిర్వహించే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని
ముద్రగడ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top