న్యూఢిల్లీ: విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పార్లమెంట్ బయట వైయస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. నాలుగేళ్లైనా విభజన హామీలు అమలు కాకపోవడంపై నిరసనలు. రైల్వేజోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, దుగ్గిరాజుపట్నం పోర్టు మంజూరు చేయాలని ఎంపీలు ధర్నాకు దిగారు.