ఎస్పీవై రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలి..!

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని  కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇవాళ ప్రివిలైజ్ కమిటీ ముందు హాజరయ్యారు.  పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన విషయాలను కమిటీకి వివరించినట్లు మేకపాటి తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరిపోయానని చెప్పిన ఎస్పీవై రెడ్డి మాట మార్చారని మేకపాటి అన్నారు. పార్టీమారినట్లు మీడియానే వక్రీకరించిందని డిస్ క్వాలిఫికేషన్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అన్ని ఛానల్స్ ,పత్రికల్లో ఆయన టీడీపీలో చేరిన విషయం స్పష్టంగా ఉందన్నారు.

ఎస్పీవైరెడ్డి తెలుగుదేశంలో చేరానని చెప్పాక షోకాజు నోటీసులు ఇవ్వడం లాంటివన్నీ చిన్నవిషయాలను కొట్టిపారేశారు. తన ప్రాంత అభివృద్ధి దృష్ట్యా తెలుగుదేశంలో చేరుతున్నానని...ఒకవేళ డిస్ క్వాలిఫై చేసినా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని ఎస్పీవైరెడ్డి చెప్పినట్లు గుర్తుచేశారు. ఆయన స్టేట్ మెంట్లకు సంబంధించిన విషయాలన్నంటినీ గమనించాక ప్రివిలైజ్ కమిటీ స్పీకర్ కు తమ నిర్ణయాన్ని విన్నవిస్తుందని మేకపాటి తెలిపారు. 
Back to Top