శివమాలధారణలో శ్రీశైలానికి బయలుదేరిన ఎమ్మెల్యే

కర్నూలు:  శివమాలధారణలో మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి శ్రీశైలం మల్లిఖార్జునస్వామి దర్శనార్థం బయలుదేరారు.  మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో  ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు వై.సీతారామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ యువనాయకులు ధరణిరెడ్డితో పాటు మరికొంత మంది గత ఐదు రోజులు క్రితం శివమాల వేసుకున్నారు. గురువారం గురుస్వామి జంబుస్వామి ఆధ్వర్యంలో ఇరుముడి కట్టించారు.  దేవాలయం నుంచి  గ్రామ శివారు వరకు ఉరేగింపు వెళ్లారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో  శ్రీశైల మల్లిఖార్జునభ్రమారాంబ దేవిల దర్శనార్థం బయలుదేరారు. వీరితో పాటు నరసింహరెడ్డి, భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Back to Top