మీడియాను నియంత్రించామంటున్న మంత్రులు

విజయవాడ) చంద్రబాబు
ప్రభుత్వం అడ్డగోలు పనులకు అంతే లేకుండా పోతోంది. తాజాగా ముద్రగడ దీక్షను ఉన్నది
ఉన్నట్లుగా చూపిస్తున్న సాక్షి చానెల్ మీద అక్కసు ప్రదర్శించింది. అనేక చోట్ల ఎమ్
ఎస్ వో ల మీద ఒత్తిడి తెచ్చి చానెల్ ను ఆపిస్తున్నట్లుగా వార్తలు వెల్లువెత్తాయి.
దీని మీద వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును
జర్నలిస్ట్‌లు ప్రశ్నించారు. దాంతో ప్రత్తిపాటి మాట్లాడుతూ.. శాంతి భద్రతల
దృష్ట్యా మీడియాను హ్యాండిల్‌ చేశామంటూ చెప్పుకొచ్చారు.గతంలో తూర్పుగోదావరి జిల్లా తుని సంఘటనలో చోటుచేసుకున్న
పరిణామాలు తెలిసిందే కాదా? అని
చెప్పారు. మళ్లీ అలాంటి పరిస్థితులు వస్తాయనే మీడియాను నియంత్రించామని మంత్రి
ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ఎటువంటి
సిగ్గు, భేషజం లేకుండా మీడియా గొంతు నొక్కుతున్నట్లు మంత్రి చెబుతున్నారంటే
పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

Back to Top