భారీగా ప్లీనరీకి తరలివెళ్లిన నాయకులు

పుల్లంపేట: రైల్వేకోడూరులో మంగళవారం వైయస్సార్‌సీపీపార్టీ నిర్వహించిన ప్లీనరీ కార్యక్రమానికి మాజీ డీసీసీ ఛైర్మెన్‌ కొల్లం బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో పుల్లంపేట మండలం నుంచి భారీసంఖ్యలో ప్రజలు తరలివెల్లారు. మాజీ మండలాధ్యక్షుడు ముద్దా వెంకటసుబ్బారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, కుమార్‌రెడ్డి, రామనాథం, రాజశేఖర్‌రెడ్డి, రాజారెడ్డి, హరినాథరెడ్డి, మదనగోపాలస్వామి, భాస్కర్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి తదితర నాయకుల ఆధ్వర్యంలో వందలాదిమంది కార్యకర్తలు బయలుదేరి వెల్లారు. ఈ సందర్భంగా వైయస్సార్‌సీపీ మండల ఇన్‌చార్జి మాట్లాడుతూ వైయస్సార్‌సీపీ కార్యకర్తలో నూతన ఉత్సాహం పెరిగిందని స్వచ్చందంగా వారే కార్యక్రమానికి వస్తుండటంచూస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు.  చంద్రబాబు చేసిన అవినీతి ప్రజల కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని, గడిచిన మూడు సంవత్సరాలలో ఏ ఒక్కఅభివృద్ది పని చేయకుండా టీడీపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రజాధనం దోచిపెట్టాడు. ఇదేమని ప్రశ్నించిన నాయకులపై తప్పుడుకేసులు బనాయిస్తున్నారు. త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని వారన్నారు. రాబోయే 2019 ఎన్నికలలో ప్రజలందరూ జగన్‌మోహన్‌రెడ్డికి ఓటువేసి ఆయనను సీఎం చేయడం ఖాయమన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top