నేలకొండపల్లికి చేరిన మరో ప్రజా ప్రస్థానం

ఖమ్మం, 24 ఏప్రిల్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ  వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఖమ్మం జిల్లా నేలకొండపల్లి చేరుకుంది. ఆమెకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. నేలకొండపల్లిలో మహానేత విగ్రహానికి పూలమాల వేసి శ్రీమతి షర్మిల నివాళులర్పించారు. తర్వాత రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.

Back to Top