బ్రాహ్మణులంటే అంత చులకనా..?

  • ఐవైఆర్ పై ప్రభుత్వం దుర్మార్గపు ప్రచారం
  • ఐవైఆర్ కు జరిగిన అవమానం..బ్రాహ్మణులందరికీ జరిగిన అవమానం
  • బాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి
హైదరాబాద్ః ఐఏఎస్ ఆఫీసర్ గా రాష్ట్రానికి ఎన్నో విశిష్ట సేవలు చేసిన అందించిన ఐవైఆర్ కృష్ణారావు పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తించిందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి మండిపడ్డారు. ఐవైఆర్ ను విమర్శిస్తూ ఆయనను పదవి నుంచి తొలగించడం అత్యంత హేయనీయమన్నారు. ఐవైఆర్ కు జరిగిన అవమానం బ్రాహ్మణులందరికీ జరిగిన అవమానమని, దీనికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని  కోన రఘుపతి హెచ్చరించారు.  బ్రాహ్మణులంటే మీకెందుకంత చులకనభావం..? ఓట్ల శాతం తక్కువగా ఉందనే బ్రాహ్మణులను అవమానిస్తున్నారా..? అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. పొలిటికల్ హంట్ పేరుతో ప్రభుత్వం దుర్మార్గంగా నాలుగురోజులుగా సోషల్ మీడియాలో ఐవైఆర్ పై ఏవో రాయించి ప్రచారం చేయిస్తోందని కోన ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ ను అరెస్ట్ చేసి నానా హంగామా సృష్టించిన ప్రభుత్వం, పొలిటికల్ హంట్ పేరుతో ఐవైఆర్ నగ్న చిత్రాలు పెడితే ఏం చర్యలు తీసుకుంటున్నారని నిలదీశారు. ఎవరినీ వదిలిపెట్టేది లేదని,  చంద్రబాబు సర్కార్ కు  బ్రాహ్మాణులంతా తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పొలిటికల్ హంట్ పై క్రిమినల్ చర్యలు తీసుకునేలా పోరాడుతామన్నారు. సుదీర్ఘ సర్వీస్ లో ఏరోజు కూడ ఐవైఆర్ పై చిన్న మచ్చలేదన్నారు.  అలాంటి వ్యక్తి గురించి ప్రభుత్వం దుర్మార్గంగా మాట్లాడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి వ్యవస్థను కుప్పకూల్చుతున్న దుర్మార్గుల్ని ఎండగట్టాల్సిన సమయం వచ్చిందని గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో కోన రఘుపతి ప్రజలకు పిలుపునిచ్చారు. 

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను చరిత్రకు విరుద్ధంగా ఇష్టానుసారంగా తీశారని వచ్చిన పోస్టుకు లైక్ చేస్తే తప్పా..? ప్రభుత్వ ఖజనాకు తూట్లు పొడుస్తూ బాహుబలి-2ను ఆరు, ఏడు షోలు వేసుకుంటున్నారని అడిగితే తప్పా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వ్యక్తిగతంగా బాపట్లకు వచ్చి జిల్లా కో ఆర్డినేటర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో బ్రాహ్మాణుల ఇబ్బందులపై ఏర్పడిన కార్పొరేషన్ లో ప్రసంగించాలని ఐవైఆర్ పిలిచారు.  స్థానిక శాసనసభ్యుడిగా తాను వెళ్లడమే నేరమా..? అని ప్రశ్నించారు. శాసనసభలోని 175మంది ఎమ్మెల్యేల్లో ఏకైక బ్రాహ్మణ ప్రతినిధిగా తాను ఉన్నానని,  బ్రాహ్మణ కార్పొరేషన్ లో విధివిధానాలపై ఏనాడు తనను సంప్రదించలేదని కోన ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్సార్సీపీ ఎమ్మెల్యేననే తమను ఇబ్బందులకు గురిచేశారని ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. 

 విశాఖలో ల్యాండ్ స్కాం జరిగిందని మీ మంత్రి అయ్యన్నపాత్రుడు సహచర మంత్రిపై చర్యలు తీసుకోవాలని చెబితే, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మీ డొక్క చీలుస్తారని భయపడుతున్నారా..?  ఈనాడు పేపర్ లో గుడ్డలు లేకుండా ఎన్టీఆర్ కు గోచి పెట్టి రాస్తే అడిగేవాడు లేడు. కానీ, నేడు ప్రశ్నించేందుకు సోషల్ మీడియా ఒకటుందన్నారు. ఐవైఆర్ ను నగ్నంగా పెట్టి గుండెమీద వైయస్ఆర్ బొమ్మ పెట్టారు. ప్రతి గుండెలో వైయస్ఆర్ ఉంటాడు.  14, 800 గుళ్లకు దూపదీప నైవిద్యాలు వెలిగించిన వ్యక్తి  వైయస్ రాజశేఖరరెడ్డి అని కోన కొనియాడారు.  
రాష్ట్రంలో 5 నుంచి 6 శాతం బ్రాహ్మణులున్నారని,  బాబు దయాదాక్షిణ్యాలతో ఎవరూ బతకడం లేదన్నారు. బ్రాహ్మణులకు హక్కుగా బడ్జెట్ కేటాయింపుల్లో రూ. 7వేల కోట్లు వెచ్చించాల్సి ఉందని,  చేయి చాచి అడగలేని దుర్భర పరిస్థితుల్లో వారున్నారని తెలిపారు . రూ. 500కోట్లతో కార్పొరేషన్ పెడతామన్న హామీని నెరవేర్చాలని ఐవైఆర్, తాను పట్టుబట్టామన్నారు. మూడేళ్లలో నాలుగు బడ్జెట్ లలో వచ్చింది రూ. 125కోట్లని అన్నారు. పెండింగ్ లో ఉన్న అప్లికేషన్స్ పరిష్కరించాలని ఒత్తిడి తెచ్చినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ఈ సంవత్సరం 75కోట్లు ఇస్తామన్న ప్రభుత్వం రూపాయి కూడ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్రాహ్మణులకు జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపడం తప్పా..? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. 

ఐవైఆర్ కు ఆర్నెళ్లుగా అపాయింట్ మెంట్ ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్రం ఉండడం దారుణమన్నారు. ఐవైఆర్ పరిస్థితే అలా ఉంటే, ఇక రాష్ట్రంలో పరిపాలన ఎంత ఘోరంగా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. బోండా ఉమ అలిగితే ఇద్దరు ముగ్గురు ఎంపీలు పోయి కూల్ చేస్తారు, అదే ఐవైఆర్ మాట్లాడితే ఇగో హర్ట్ అయిందంటారా..? అని ప్రభుత్వంపై కోన ఫైర్ అయ్యారు. బ్రాహ్మాణుల ఓట్లు తక్కువనేగా మీరు ఆరకంగా చూస్తోందని ఆగ్రహించారు.  బాబుకున్న అపారమైన అనుభవం ఉపయోగపడుతుందని  బ్రాహ్మణులు ఆరకంగా ఆళోచన చేశారు కాబట్టే ముఖ్యమంత్రి పీఠం దక్కిందన్న విషయాన్ని ఆయన గ్రహించాలన్నారు. రాజధాని అమరావతిపై నిపుణులు డాక్యుమెంట్స్ ఇస్తే దాన్ని పట్టించుకోకుండా చెత్తలో వేసిన ఘనుడు బాబు అని కోన నిప్పులు చెరిగారు. శ్రీకమిటీ చెప్పిన ఏ విషయాలను బాబు పరిగణలోకి తీసుకోలేదన్నారు.  అదేదో వైయస్ జగన్ చెప్పినట్టుగా, ఆయన ఆస్తులు అక్కడున్నట్టుగా విష ప్రచారం చేశారని మండిపడ్డారు.  రాజధాని పేరుతో చంద్రబాబు తన మంది మార్బలానికి వేలాది ఎకరాలు అప్పనంగా ధారాదత్తం చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని ధ్వజమెత్తారు.  శ్రీకమిటీ చెప్పిన విషయాలను, అదేదో వైయస్ జగన్ చెప్పినట్టుగా, ఆయన ఆస్తులు అక్కడున్నట్టుగా విష ప్రచారం చేశారని మండిపడ్డారు.  

తాజా ఫోటోలు

Back to Top