

















గుడివాడ, 05 ఏప్రిల్ 2013:
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి చంద్రబాబు సలహాదారులా వ్యవహరిస్తున్నారని శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని విన్నకోట గ్రామంలో శుక్రవారం ఉదయం ఆమె రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలు చెప్పిన సమస్యలను సావధానంగా విని బదులు చెప్పారు. కిరణ్ సర్కారు ఏ వర్గానికీ న్యాయం చేయలేకపోతోందని ఆరోపించారు. చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని కిరణ్ పరిపాలిస్తున్నారని ఎద్దేవా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలపై అప్పుల భారాన్ని మోపుతున్నారన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ప్రజల అవసరాలను గుర్తించి పథకాలను అమలుచేశారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. టీడీపీ, కాంగ్రెస్ లను ఓడించి రాజన్న రాజ్యం ఏర్పడేందుకు కృషి చేయాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు.