ప్రజలారా ఎక్కడిక్కడ నిలదీయండి

పచ్చచొక్కాల కోసమే జన్మభూమి కమిటీలు
నెలకో కార్యక్రమం పేరుతో మభ్యపెడుతున్నారు
అభివృద్ధి ముసుగులో కుంభకోణాలు

హైదరాబాద్ః
వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరిగారు.
ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా జన్మభూమి కార్యక్రమాల పేరుతో
వస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను నిలదీయాలని వైవి సుబ్బారెడ్డి
ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా
నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. టీడీపీ మేలు కోసమే ప్రభుత్వం జన్మభూమి
కమిటీలు వేసిందని సుబ్బారెడ్డి ఫైరయ్యారు.  

చంద్రబాబు
పచ్చచొక్కాలకు జన్మభూమి కమిటీలు కట్టబెట్టి మొత్తం వాళ్లకు
దోచిపెడుతున్నారని వైవి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో
భాగంగానే తమ్ముళ్ల జేబులు నింపేందుకు రూ. 13 కోట్లు విడుదల చేశారని
దుయ్యబట్టారు.  అంతమాత్రం దానికి కమిటీలు వేయడం దేనికని, ముఖ్యమంత్రి,
మంత్రులు అంతా దండగని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు వందలాది వాగ్దానాలు
ఇచ్చిన చంద్రబాబు వాటికి తూట్లు పొడిచారని వైవి సుబ్బారెడ్డి
తూర్పారబట్టారు.  ముఖ్యమంత్రి తాను చేసిన తొలి ఐదు సంతకాలకే దిక్కులేకుండా
పోయిందని ఎత్తిపొడిచారు. 

తెలుగుదేశం పార్టీకి,
కార్యకర్తల కోసమే రాష్ట్రంలో కార్యక్రమాలు జరుగుతున్నాయని వైవి
సుబ్బారెడ్డి ఆరోపించారు. ప్రతి నెల ఓ తంతులాగా చంద్రబాబు మీడియా ముందు
నెలకో కార్యక్రమం పెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. మోటార్
సైకళ్ల మీద పచ్చచొక్కాలు వేసుకొని జన చైతన్యయాత్రలు చేశారు.  ఉద్యోగాలు
ఎన్ని పీకేశామో చెప్పడానికే  కార్యక్రమాలు చేస్తున్నారా అని ప్రభుత్వానికి
చురక అంటించారు. జన్మభూమి కమిటీల పేరుతో లబ్దిదారులను ఆశపెట్టడం తప్ప
....వాటివల్ల ఒరిగేదేమీ లేదని వైవి సుబ్బారెడ్డి అన్నారు.  అభివృద్ధి
పేపర్లలో, మీడియాలో జరిగింది తప్ప వాస్తవ అభివృద్ధి ఎక్కడ జరగలేదని స్పష్టం
చేశారు.  

ఎమ్మెల్యేల నిధులని చెప్పి....
ఇంఛార్జ్ లుగా ఉన్న టీడీపీ నాయకులకు వాటిని తరలిస్తున్నారని
విరుచుకుపడ్డారు. ఈవిధమైన పాలన జరగడం సిగ్గుచేటన్నారు. హామీల అమలుపై
పచ్చనేతలను ఎక్కడిక్కడ నిలదీయాలని ఎంపీ ప్రజలకు సూచించారు. రుణాల మాఫీ
వడ్డీలకు కూడా సరిపోలేదని సుబ్బారెడ్డి ఫైరయ్యారు. డ్వాక్రారుణాల మాఫీ
ఊసేలేదన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అన్నారు. ఎక్కడా కూడా హామీలు
అమలు చేసిన పాపాన పోవడం లేదన్నారు. రాజధాని ముసుగులో టీడీపీ సర్కార్ రియల్
ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. అమరావతి, పట్టిసీమ, పవర్
ప్రాజెక్ట్ లంటూ పెద్ద ఎత్తున కుంభకోణాలకు పాల్పడుతున్నారని పచ్చసర్కాప్ పై
నిప్పులు చెరిగారు. 
Back to Top