జగన్ ప్రభంజనాన్ని నిరోధించలేరు

అనంతపురం:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనన్ని ఎవరూ తట్టుకోలేరని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, ఉరవకొండ నియోజకవర్గ ఇన్చార్జి అయిన వై. విశ్వేశ్వరరెడ్డి స్పష్టంచేశారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా కూడేరు మండలం జల్లిపల్లిలో గురువారం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఎంత మంది సోనియాలు, చంద్రబాబులు వచ్చినా ఆయన ప్రభంజనాన్ని అడ్డుకోలేరని  పేర్కొన్నారు. మహానేత వైయస్ అమలుచేసిన పథకాలు అన్ని వర్గాలకు మేలు చేశాయన్నారు. అందువల్లే ఆయన ప్రజల హృదయాల్లో కొలువయ్యారని చెప్పారు. వైయస్ మరణించాక ఆయన కుటుంబం వెంటే జనం నడుస్తున్నారని చెప్పారు. మహానేత లక్షణాలను పుణికిపుచ్చుకున్న జగన్ ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ప్రజలను విస్మరించలేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేసి.. జనం హృదయాలను గెలుచుకున్నారన్నారు. జగన్‌కు వస్తోన్న స్పందనను చూసి ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీ కలిసి సీబీఐతో అరెస్టు చేయించి రాక్షసానందం పొందుతున్నాయని విమర్శించారు. తండ్రి మరణం, అన్న జైళ్లో ఉండటంతో మనసులో ఎంతో బాధ ఉన్నా కష్టాల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పడానికి షర్మిల పాదయాత్ర చేపట్టారన్నారు. ఈ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతోండటం చూస్తుంటే ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్‌సీపీ జయకేతనం ఎగురవేయడం ఖాయమన్నారు. మీకోసం వస్తున్నా.. నంటూ చంద్రబాబు కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం నాటి పాదయాత్రలో ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి, వైయస్ఆర్‌ కాంగ్రెస్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, వైయస్ అవినాశ్ రెడ్డి, జిల్లా కన్వీనర్ ఎం.శంకరనారాయణ, ఎమ్మెల్యేలు బి.గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి సతీమణి భారతి, డాక్టర్ హరికృష్ణ, పైలా నర్సింహయ్య, వై.మధుసూదన్‌రెడ్డి, బి.ఎర్రిస్వామిరెడ్డి, బోయ సుశీలమ్మ, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, కంచం లీలావతి, సీపీ వీరన్న, వెన్నపూస రవీంద్రారెడ్డి, లీగల్‌సెల్ నారాయణరెడ్డి, లింగాల రమేష్, రంగంపేట గోపాల్‌రెడ్డి, కొర్రపాడు హుస్సేన్‌పీరా, విద్యాసాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top