జగన్‌ నిర్దోషి అని జగమంతా తెలుసు: మేకతోటి

గుంటూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్దోషి అని జగమంతా తెలుసు అని ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పేర్కొన్నారు.  శ్రీ జగన్మోహన్‌రెడ్డి బయట ఉంటే తమ ఆటలు సాగవన్న భయంతో కాంగ్రెస్, ‌టిడిపిలు కలసి కుట్ర పన్ని జననేతను జైలుకు పంపించాయని ఆమె ఆరోపించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్‌, టిడిపిలు కుట్ర పన్ని, సిబిఐని వాడుకుని జననేత శ్రీ జగన్‌ను జైలుకు పంపించిన తీరుకు నిరసనగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గుంటూరులో నిర్వహించిన 'జగన్‌ కోసం.. జనం సంతకం' కార్యక్రమంలో ఎమ్మెల్యే సుచరిత మాట్లాడారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డికి మద్దతుగా సేకరిస్తున్న కోటి సంతకాలు ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు వంటివని పార్టీ జిల్లా పరిశీలకుడు పి.గౌతమ్‌రెడ్డి అన్నారు. పార్టీ మైనార్టీ విభాగం నగర కన్వీనర్ మార్కె‌ట్‌బాబు ఆధ్వర్యంలో నగరంలోని మున్సిపల్ కూరగాయల మార్కె‌ట్ వద్ద కోటి సంతకాల సేకరణలో భాగంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేతిలో కీలుబొమ్మగా సిబిఐ వ్యవహరిస్తోంద‌ని పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ‌ఆరోపించారు.

సంతకాల కోసం బారులు తీరిన జనకోటి:
శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి మద్దతుగా మార్కెట్ వద్ద నిర్వహించిన శిబిరంలో సంతకాలు చేసేందుకు ప్రజలు బారులు తీరారు. వికలాంగులు, వృద్ధులు,‌ మహిళలు కూడా వేచి ఉండి సంతకాలు చేశారు. కొంతమంది నిరక్షరాస్యులు తమ పేర్లు చెప్పి వేలిముద్రలు వేశారు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగనే సిఎం:
పెద్దపల్లి: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆర్టీసీ మాజీ చైర్మ‌న్ గోనె ప్రకా‌శరావు అన్నారు. పెద్దపల్లి జెండా చౌరస్తా వద్ద  'జగన్ కోసం.. జనం సంత‌కం' సేకరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. జనమంతా జగన్‌వైపే చూస్తుండడాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్, ‌టిడిపిలు కుమ్మక్కై ఆయనను జైలుకు పంపాయని ఆరోపించారు.

జగన్ నిర్బంధంపై జనం నిరసన‌: :
ఖమ్మం: శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని జైలులో నిర్బంధించడాన్ని నిరసిస్తూ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోందని ‌వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజ‌య్‌కుమార్, ‌సిఇసి సభ్యుడు బాణోత్ మద‌న్‌లాల్ చెప్పారు. ‌కోటి సంతకాల కార్యక్రమాన్ని వారు ఖమ్మంలో ప్రారంభించారు. అనంతరం, మాట్లాడుతూ.. ప్రతి మండలలో 10 నుంచి 15 వేల సంతకాలు సేకరించాలని లక్ష్యం నిర్ణయించినట్లు చెప్పారు. సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. పాదచారులు, వాహన చోదకులు నాయకుల వద్దకు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు.

యజ్ఞంలా సంతకాల సేకరణ:

కల్లూరు: శ్రీ జగన్మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణను యజ్ఞంలా చేయాలని ‌పార్టీ కర్నూలు జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి కోరారు. ఆయన తొలి సంతకం చేసి సేకరణకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమానికి పత్తికొండ, డోన్, శ్రీశైలం ‌నాయకులు కోట్ల హరి చక్రపాణి రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరెడ్డి హాజరయ్యారు.

కక్ష సాధింపు చర్యలు ఆపాలి: ఎడ్మ
మహబూబ్‌నగర్: రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేని కాంగ్రె‌స్, ‌టిడిపిలు తమ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌ రెడ్డిపై ఇప్పటికీ కుట్రలను కొనగిస్తున్నాయని పాలమూరు జిల్లా పార్టీ కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి దుయ్యబట్టారు. శ్రీ వైయ‌స్ జగ‌న్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దమనకాండను ఆపాలని కోరుతూ ఆ పార్టీ చేపట్టిన ‘జగన్‌ కోసం.. జనం సంతకం’ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రారంభించారు.
Back to Top