పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించిన జగన్‌

హైదరాబాద్, 25 సెప్టెంబర్ 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి పార్టీ వ్యవహారాలపై తొలిరోజునే దృష్టి సారించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు,‌ పార్టీ అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు బుధవారం నాడు పార్టీ ఎమ్మెల్యేలు, ఎం.పి., తాజా మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో శ్రీ జగన్ భేటీ అయ్యారు. ‌లోటస్‌పాండ్‌లోని శ్రీ జగన్మోహన్‌రెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సుమారు అరగంట పాటు ఈ భేటి జరిగింది.

సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఏ విధంగా మరింత ముందుకు తీసుకెళ్లాలి? మిగిలిన రాజకీయ పార్టీలపై ఒత్తిడి ఎలా పెంచాలనే దానిపై ఈ సమావేశంలో సమాలోచనలు జరిగాయి. రాజీనామా చేయకుండా డ్రామాలు అడుతున్న కాంగ్రెస్‌, టిడిపి నాయకుల తీరును ప్రజలలో ఏ విధంగా ఎండగట్టాలనే అంశంపై ఈ భేటీలో వారు చర్చించినట్టు సమాచారం.

Back to Top