విశాఖ బహిరంగ సభ 2019లో గెలుపునకు నాంది


విశాఖః విశాఖలోని కంచరపాలెంలో జరగబోయే వైయస్‌ఆర్‌సీపీ భారీ బహిరంగ సభ 2019లో వైయస్‌ జగన్‌ గెలుపునకు నాంది కాబోతుందని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం  జరగబోయే బహిరంగ సభలో జగన్‌ ప్రసంగం కోసం ప్రజలు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా బహిరంగ సభలో పాల్గొనడానికి సిద్ధమయ్యారన్నారు.బడుగు,బలహీన వర్గాల ఆశాదీపంలా  ప్రజలు భావిస్తున్నారన్నారు. విశాఖ పార్లమెంటులో ఏకైక సభ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. కంచరపాలెం మెట్టలో పండగ వాతావరణం నెలకొంది. 
Back to Top