ఎమ్మెల్యే కృషి వ‌ల్లే ఇన్‌ఫుట్‌ సబ్సిడీ మంజూరు

వైయ‌స్ఆర్ జిల్లా:  వైయ‌స్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి కృషి వ‌ల్ల గాలివీడు మండల రైతాంగానికి ఇన్‌పుట్ స‌బ్సిడీ మంజూరైన‌ట్లు పార్టీ మండ‌ల అధ్య‌క్షుడు గుమ్మా ఈశ్వ‌ర‌రెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయ‌న విలేకర్లతో మాట్లాడుతూ రైతులు వేసిన పంటలు చేతికి రాక అప్పుల ఊబిలో కూరకుపోతుండడంతో ఈ మండలంలో ఎండిపోయిన వేరుశనగ పొలాలో ఎమ్మెల్యే పర్యటించి రైతుల బాధను స్వయంగా తెలుసుకొని రైతు బాధలను వ్యవసాయ కమీషనర్‌ ధనుంజయ్యరెడ్డికి పలు మార్లు రైతుల పరిస్థితిని వివరించడంతో నేడు ఆయన కృషి ఫలితమే రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ అందుతుందని, అందువలన రైతులు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలుపుతున్నారని తెలియజేశారు.  

Back to Top