కర్నూలు అభివృద్ధికి కృషి చేస్తా

కర్నూలు:  కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెప్పించి అభివృద్ధి పనులు చేస్తామని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పేర్కొన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కొత్తపేటలోని మస్తాన్‌వలి బాబా దర్గాను ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, ఎంపీ బుట్టారేణుక దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈసందర్భంగా ఎంపీ విలేకరులతో మాట్లాడారు. కర్నూలు జిల్లాకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, త్రిబుల్‌ఐటీ వస్తున్నాయన్నారు. దీంతో యువతకు పుష్కలంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ మండల కో-కన్వీనర్ కిట్టు, నాయకులు రంగన్న, వెంకటరాముడు, కబీర్, బాషా తదితరులు పాల్గొన్నారు.
Back to Top