ఆళ్లగడ్డ: భార్యగానే కాదు.. మంచి స్నేహితురాలు కూడా తనకు శోభానాగిరెడ్డి దగ్గరయిందని భూమా నాగిరెడ్డి అన్నారు. శోభా నాగిరెడ్డి ఆళ్లగడపలో ఏర్పాటు చేసిన సంతాప సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ శోభ లేని లోటు తీరనిదని, ఎంతో బాధగా ఉందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి రోజు తన జీవితంలో ఉంటుందని ఊహించలేదని చెప్పారు. ప్రస్తుతం తాను బతికి ఉన్నానంటే అది తన పిల్లలకోసమేనని చెప్పారు. శోభా నాగిరెడ్డి జీవితమంతా కష్టాలే అనుభవించిందని చెప్పారు.<br/>తమది చాలా పెద్ద కుటుంబమన్న ఆయన ఆమె తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరి యోగక్షేమాలు తెలుసుకునేదని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉన్న.. ఎక్కడ ఉన్నా నెంబర్ వన్ గా ఉండాలని కోరుకునేవారని చెప్పారు. తనకు వైఎస్ ఆర్ తప్ప ఎవరూ తెలియదని, వైఎస్ ఆర్ మరణం తర్వాతే తానుజగన్ను కలిసినట్లు తెలిపారు. జగన్ సీఎం కావాలని శోభా నాగిరెడ్డి కోరుకున్నారని చెప్పారు. ఆమె అడుగు అడుగునా ఇదే విషయం చెప్పారని.. ప్రతి సారి అదే మాటపలికారంటూ కన్నీటి పర్యంతమయ్యారు.